న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కిన దసరా మూవీ 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ది ప్యారడైజ్ పేరుతో మరో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఏకంగా 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. సుధాకర్ చెరుకూరి కథపై నమ్మకంతో ఈ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు.
 
అయితే ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా 65 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. సీనియర్ హీరోలు చిరంజీవిి, బాలయ్య సినిమాల హక్కులు సైతం ఇంత భారీ మొత్తానికి అమ్ముడవడం లేదు. వరుస విజయాలతో పాటు నాని సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుండటం ఈ రేంజ్ లో హక్కులు అమ్ముడవటానికి కారణం అని చెప్పవచ్చు.
 
నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ ఏడాది హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని సినిమాల హక్కులు ఓటీటీల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ది ప్యారడైజ్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఓటీటీ రైట్స్ కోసం ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడిందని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
ది ప్యారడైజ్ సినిమా హిందీ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. వరుస విజయాలతో నాని టైర్1 హీరోగా ఎదిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ పరంగా నానికి తిరుగులేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాని తర్వాత సినిమాలతో ఏ రేంజ్ హిట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: