సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ సాధిస్తారో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు ఊహించని వివాదాలలో చిక్కుకోవడం వల్ల కెరీర్ నాశనం అయిన సందర్భాలు సైతం ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో అర్ధాంతరంగా కెరీర్ ను ముగించిన హీరోయిన్లలో వినీత ఒకరు. వినీత అంటే సులువుగా గుర్తు పట్టలేరు కానీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ హీరోయిన్ అంటే సులువుగా గుర్తు పడతారు.
 
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సౌందర్య నటించగా సెకండ్ హీరోయిన్ గా వినీత నటించడం జరిగింది. ఒక కేసులో చిక్కుకోవడం వల్ల వినీత కెరీర్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తమిళంలో పెద్ద హీరోలతో నటించిన వినీత కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోవడం ఆమె అభిమానులను సైతం ఎంతగానో బాధ పెట్టిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఊహించని కేసు వల్ల వినీత మానసిక క్షోభ అనుభవించారు. వినీత తల్లి, సోదరునిపై కూడా ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తర్వాత రోజుల్లో వినీత ఈ కేసు నుంచి సులువుగానే బయటపడ్డారు. ఆ తర్వాత వినీతకు మూవీ ఆఫర్లు రాలేదు. కొన్నేళ్ల క్రితం శ్వేతా బసు ప్రసాద్ ఏ విధంగా వివాదాల్లో చిక్కుకుందో ఒకప్పుడు వినీత కూడా అదే తరహా ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు.
 
వినీత కెరీర్ రాబోయే రోజుల్లో అయినా పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది. వినీత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. వినీత రెమ్యునరేషన్ సైతం ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. వినీత రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి సంచలనాలను సృష్టిస్తారేమో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న హీరోయిన్లు ఈ తరహా పరిస్థితిని ఎదుర్కోవడం అభిమానులను ఎంతగానో బాధ పెడుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: