సినిమా అంటేనే ఓ రంగుల కలల ప్రపంచం .. ఇలాంటి ప్రపంచంలో క్రేజ్‌ అందుకోవటమే కాదు అవమానాలు ఆవేదనలు కూడా ఎదురవుతూ ఉంటాయి .. అవన్నీ తొట్టుకొని నిలబడి తమ శక్తి ప‌ట్టుల‌ద‌ల‌ కృషి ఉంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు .. ఇందుకు చిన్న ఎగ్జాంపుల్ నయనతార సౌత్ లోని అగ్ర హీరోయిన్గా వెలిగిపోతున్న నటి .. అంతేకాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా కూడా దూసుకుపోతుంది .. అలాగే నయనతార జీవితం తెరిచిన పుస్తకం అన్ని తానే చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . అయితే ఈమె జీవితంలో కొన్ని చేదు అనుభవాలతో కూడిన పేజీలు ఎన్నో ఉన్నాయి .. కేరళలోని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నయనతార అసలు పేరు డయానా కురియన్ అందరికీ తెలిసిందే ..


అయితే ఆమె ఈ స్థాయికి ఎదిగేందుకు పడిన శ్రమ అవమానాలు ఆవేదనలు చాలానే ఉన్నాయి .. నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చిన నయనతారకు కోలీవుడ్ లో ముందుగా అవకాశం  ఇచ్చింది నటుడు దర్శకుడు పార్థిబన్ .. అయితే నయనతార ఆయన చెప్పిన సమయానికి రాకపోవడంతో తిరిగి మళ్లీ సినిమా నుంచి పంపించినట్లు పార్టీబ‌న్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు .. అలాగే నయనతార హీరోయిన్గా నటించిన తొలి తమిళ సినిమా అయ్యా .. అయితే ఈ సినిమా షూటింగ్లో తొలిరోజే నయనతార పై దర్శకుడు హరి ఆగ్రహానికి గురయ్యారు .. మొదటి రోజునే మోడ్రన్ డ్రెస్ లో గ్లామర్గా  షూటింగ్ కు వచ్చిన ఆమెను చూసి దర్శకుడు కొంత టెన్షన్ పడ్డారు .


ఈమెను ఇక్కడి నుంచి వెంటనే బయటకు పంపించండి అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు .. ఈ సినిమాకి హీరోయిన్గా నయనతార పనికిరాదని కూడా అన్నారు .. అదే సమయంలో సాయంత్రం వేరే డ్రస్సు మార్చి చూద్దామని కూడా చెప్పారట .. అయితే ఈ విషయాన్ని ఈ సినిమా హీరో శరత్ కుమార్ ఇటీవల వేదికపై పంచుకున్నారు .. ఇక ఆ తర్వాత తన పాత్రకు తగ్గట్టుగా ఆమెను మార్చుకుని అచ్చమైన తమిళ అమ్మాయిగా ఆ సినిమాలో నటింప చేశారట .. ఇక ఆ తర్వాత తన పాత్రకు త‌గ‌ట్టుగా మార్చుకుని నయనతార అయ్యా సినిమాలో నటించారు.. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడం ఆ తర్వాత రజనీకాంత్ కు జంటగా చంద్రముఖి సినిమాలో నటించే అవకాశం వంట‌వి రావటంతో నయనతార ఆగ్ర  హీరోయిన్గా ఎదిగారు .. అలాగే ఆమె ప్రేమ వ్యవహారంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని కూడా చెప్పక తప్పదు .. ఇక ఇప్పుడు దర్శకుడు విగ్నేష్ శివ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమె తన జీవితంలో ఎంతో ఆనందంగా ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: