జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారుతున్నాయి.. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రోజులను సైతం పవన్ కళ్యాణ్ అక్కడ గుర్తు చేసుకోవడం జరిగింది.. అలాగే రాజకీయాలలో తాను ఎదుగుతున్న ఎన్నో అవమానాలను భరించానంటూ తెలియజేశారు. అలాగే త్రిభాషా విధానం పైన పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం కూడా అటు చాలా ప్రాంతాలను విమర్శలు చేసేలా చేసింది. ముఖ్యంగా హిందీ భాషను అడ్డుకుంటున్న తీరు తమిళనాడు ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.


హిందీ భాష మాత్రం వద్దు.. తమిళ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసుకొనే ఆ డబ్బులు మీకు కావాలి కానీ భాష మాత్రం వద్దా అంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది పవన్ కళ్యాణ్.. అటు కొంతమంది మెచ్చుకోగా మరి కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎండగడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే హీరోయిన్ మీరా చోప్రా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక ట్వీట్ చేసింది.. పవన్ కళ్యాణ్ ఒక దమ్మున్న నాయకుడు అంటు పొగిడేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ కళ్యాణ్, మీరా చోప్రా కాంబినేషన్లు బంగారం అనే సినిమా వచ్చింది.


అయితే ఈ క్రమంలో అప్పటినుంచి పవన్ కళ్యాణ్ తనకి బాగా పరిచయం ఉంది కాబట్టి ఇలా ట్వీట్ చేసిందంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఉంటే మరి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ జాతీయస్థాయిలో నాయకుడిగా ఎదుగుతారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిన చెల్లుతుందనే  విధంగా వార్తలు వినిపిస్తున్నాయి..ఇప్పటికే ఏపీలో కూటమిలో భాగంగా బిజెపి, టిడిపి, జనసేన కలిసే ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటాదొ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: