టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో... విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి సక్సెస్ హీరోగా మారిపోయాడు హీరో విశ్వక్సేన్. అయితే అలాంటి విశ్వక్సేన్ కు ఊహించని పరిణామం ఎదురైంది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఎవరూ లేని సమయంలో... హీరో విశ్వక్సేన్ ఇంట్లో దొంగతనం చేశారు దుండగులు.


హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉన్న విశ్వక్సేన్ ఇంట్లో తాజాగా దొంగలు పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. హీరో విశ్వక్సేన్ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించారట. అయితే ఎంతమంది దొంగలు వచ్చారు అనేది తెలియదు కానీ... హీరో విశ్వక్సేన్ సోదరి వన్మయ్‌.. బెడ్ రూమ్ లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించారట.  అయితే దీనిపై వెంటనే... హీరో విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు... స్థానిక ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారట.


దీంతో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు వార్త బయటకు వచ్చింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు... కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిలింనగర్ లోని రోడ్ నెంబర్ 8లో.. హీరో విశ్వక్సేన్ ఇల్లు ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరో విశ్వక్సేన్ కూడా... ఇదే ఇంట్లో ఉంటున్నారు. అయితే సమ్మర్ కావడంతో విదేశాలకు వెళ్లారట హీరో విశ్వక్. అటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వేరే టూర్ వెళ్లినట్లు సమాచారం అందుతుంది.


ఈ సమయంలోనే దొంగలు... ఆభరణాలు దొంగిలించారట. ఇక ఈ దొంగతనం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఈ హీరో విశ్వక్సేన్ తాజాగా లైలా సినిమాతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతేకాదు.. ఈ లైలా సినిమాపై వైసీపీ దారుణంగా ట్రోల్స్‌ చేసింది. బ్యాన్‌ చేయాలని కూడా వైసీపీ పోస్టులు పెట్టింది. కమెడీయన్‌ పృధ్వీ కారణంగా ఈ వివాదం చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: