సినిమాలకు క్రికెట్ కు దగ్గర సంబంధం ఉంది .. ఇక మన దేశంలో అయితే సినిమా స్టార్లకు , క్రికెట్లకు భారీ రేంజ్ లో అభిమానులు ఉంటారు .. అలా సినిమాలు , క్రికెట్ రెండిటితోను సంబంధం ఉన్న అత‌ను ఇప్పుడు ఈ టీమిండియా ఎవరో గుర్తుపట్టారా ? ప్రజెంట్ ఈ ప్లేయర్ పేరు భారత క్రికెట్లో తెగ వినిపిస్తుంది .. ప్రధానంగా ఈ క్రికెటర్ పేరు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది .. అయితే ఈ క్రమంలోని అతని గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి .. అసలు మేటర్ ఏమిటంటే .. క్రికెటర్ టీమిండియాలోకి రాకముందు ఒక తమిళ సినిమాలో నటించారు .. ఓ క్లబ్ క్రికెటర్ పాత్రలో  నటించి మెప్పించాడు ..


ఇక పైన కనిపిస్తున్న ఫోటోలు అవే .. ఆ క్రికెటర్ ఎవరో కనిపెట్టారా .. ఇంతకీ ఆ ప్లేయర్ మీరెవరో కాదు. రీసెంట్గా ముగిసిన ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీలో భారత్ ను గెలిపించడంలో ముఖ్యపాత్ర పోషించిన  మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి .. విష్ణు విశాల్ హీరోగా 2014లో తమిళంలో రిలీజ్ అయిన జీవా అనే సినిమాలో వరుణ్ చక్రవర్తి ఓ కీలకపాత్రలో నటించారు .  స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాల్లో వరుణ్ హీరో క్రికెట్ టీం లో సభ్యుడుగా కాసేపు నటించారు .. ఇక ఈ సినిమాలో తెలుగు అమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్గా నటించిండం మరో విశేషం .. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది ..


జీవా మూవీతో పాటు కోకో విత్ కామెడీ అనే టీవీ షోలో కూడా అతిథిగా వరుణ్ చక్రవర్తి పాల్గొన్నారు . ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు వరుణ్ చక్రవర్తి .. టోర్నీలో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన వరుణ్ ఏకంగా తొమ్మిది వికెట్లు తీశాడు .. తద్వారా ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో రెండో స్థానంలో నిలిచాడు . ఈ సిరీస్‌ కు ముందు ఇంగ్లాండ్ , సౌత్ఆఫ్రికా మ్యాచ్లో కూడా  తన అద్భుతమైన  బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు ఈ క్రేజీ స్పిన్నర్ .. తన బౌలింగ్ తో వరుణ్ చక్రవర్తి ఇక టీ20 లోను వన్డీలోను టీమిండి రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి: