
స్టైలిష్ స్టైల్ అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో ఎన్నో సినిమాలల్లో నటించాడు . అయితే అల్లు అర్జున్ చేసిన సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి.. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం సొంత ఫాన్స్ కూడా బూతులు తిట్టేలా చేసింది. ఆ సినిమా మరేంటో కాదు "నా పేరు సూర్య నా ఊరు ఇండియా". ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ హీరోయిన్గా అను ఇమ్మానుయేల్ నటించారు . అంతేకాదు ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అవుతుంది అంటూ అంత భావించారు.
కానీ సినిమాకి అంత సీన్ లేదు అంటూ ఫస్ట్ బొమ్మతోనే తెలిసిపోయింది . అల్లు అర్జున్ ని దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎందుకు చూస్ చేసుకున్నావ్ బన్నీ అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి సినిమా ఒప్పుకున్నావు నీ మైండ్ దొబ్బిందా..? అంటూ కూడా మాట్లాడారు. అలాంటి ఒక చెత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. కానీ అల్లు అర్జున్ కి ఈ సినిమా అంటే చాలా చాలా స్పెషల్ . చాలా చాలా ఇష్టం కూడా. తన కెరీర్ లో కొన్ని సినిమాలను అల్లు అర్జున్ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారు. అందులో నా పేరు సూర్య నా ఊరు ఇండియా సినిమా కూడా ఉండడం గమనార్హం..!