2019లో హీరో కార్తీ నటించిన చిత్రం ఖైదీ.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు విచిత్రానికి దర్శకత్వం వహించగా ఇందులో హీరో పాత్ర పేరు ఢిల్లీ.. ఈ పాత్ర ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కార్తీ తన నటనతో అద్భుతమైన ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా భారీ రేంజ్ లో రావడంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని చివరిలో ప్రకటించారు. ఈ సీక్వెల్ కోసం ఎన్నో ఏళ్ళుగా అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాకి లింకప్ తో చాలా సినిమాలు విడుదలయ్యాయి.



అలాగే వీటికి కొనసాగింపుగా ఖైదీ-2, విక్రమ్ 2 , రోలెక్స్ వంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. LCU లో భాగంగానే రజినీకాంత్ కూలి సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు. దీంతో గత కొద్దిరోజులుగా ఖైదీ 2 సినిమా తీస్తారని విషయంపై వార్తలు వినిపిస్తున్న సమయంలో తాజాగా హీరో కార్తీ తన సోషల్ మీడియా ద్వారా ఒక విషయాన్ని పంచుకున్నారు. ఇటీవలే డైరెక్టర్ లోకేష్ కనకరాజు పుట్టినరోజులు చాలా గ్రాండ్గా చేసుకున్నారు.. హీరో కార్తీక్ కూడా డైరెక్టర్ కు ఒక స్పెషల్ గిఫ్ట్ ని కూడా ఇచ్చారట.


సపరేట్గా లొకేషన్ కి పిలిపించి మరి డైరెక్టర్ లోకేష్ కు కార్తి ఒక గడియారాన్ని కూడా తొడిగేశారు.. అనంతరం అందుకు  సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయగా త్వరలోనే ఢిల్లీ మళ్లీ తిరిగి వస్తున్నాడు ఈ ఏడాది మీకు అద్భుతంగా గడిచిపోవాలి అంటూ డైరెక్టర్ లోకేష్ కు బర్త్ డే విషెస్ తెలియజేయడం జరిగింది కార్తీ.. దీంతో ఈ స్పెషల్ గిఫ్ట్ థాంక్యూ సార్ అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది లోకేష్.. మొత్తానికి ఖైదీ 2 సినిమా తెరకెక్కించబోతున్నట్లు ఇలా హింట్ ఇవ్వడంతో అభిమానులు కూడా  ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఢిల్లీ తదుపరి కథను చూపిస్తారా అతను  జైలుకు ఎందుకెళ్లారు?..జైలు జీవితం ఎలా ఉంది?.. అంతకుముందు ఏం చేసేవారు అన్న కథంశంతో వస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: