మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయిక లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.. అది కూడా మల్టీ స్టారర్ మూవీ కావడం విశేషం.అయితే ఈ సినిమా లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకుంటాయని మేకర్స్ ధీమాగా వున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు..

సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఓ ఐకానిక్ డాన్స్ మూమెంట్స్ తో కూడిన సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ హృతిక్ రోషణ్ కు ఆ సాంగ్ ప్రాక్టీస్ లో కాలు బెనకడం తో ఆ సాంగ్ షూటింగ్ కాస్త ఆలస్యం కానుంది.ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ “ స్పై యూనివర్స్ “ పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రూపొందించారు..

వాట్సాప్ గ్రూపులో YRF స్పై సినిమాల్లో నటించిన వారంతా చాటింగ్ చేస్తున్నట్లు క్రియేట్ చేసారు.. చివరి లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వీడియో ముగుస్తుంది.. ఈ వీడియో చూసిన యశ్ రాజ్ ప్రొడక్షన్ టీం మాకంటే ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారుగా అంటూ కామెంట్స్ చేసింది..ఈ సారి థియేటర్స్ దద్దరిల్లి పోతాయని ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: