
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు రోజులలోనే 15.90 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టిందట. ముఖ్యంగా రెండవ రోజు ఏకంగా 7.80 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇక ఈరోజు ఆదివారం కావడం చేత ఈ సినిమా కలెక్షన్స్ కి మరింత ఎక్కువ వచ్చే ఆస్కారం ఉన్నట్లు చిత్ర బృందం అంచనా వేస్తోంది.
మొత్తానికి కోర్టు సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం చిన్న సినిమాగా విడుదలై భారి అద్భుత విజయాన్ని అందుకుంటుంది.మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. మొత్తానికి నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే హీరో నాని కూడా ఈ డైరెక్టర్ దర్శకత్వంలోనే సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా హిట్ 3, ప్యారడైజ్ వంటి చిత్రాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మరి ఈ సినిమాలు కూడా నాని కెరియర్ ని మలుపు తిప్పుతాయేమో చూడాలి.