
విక్టరీ వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలో ఓ సీనియర్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. రీసెంట్ గానే "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది . అలాంటి హిట్ తర్వాత వెంకటేష్ ఎలాంటి సినిమాలను చూసి చేసుకోవాలో అందరికీ తెలిసిందే . కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు అంటూ టాక్ వినిపిస్తుంది . విక్టరీ వెంకటేష్ తన కెరీర్లు ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇచ్చాడు .
కానీ ఇప్పుడు ఆయన హిట్ లేని డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం అందరికి షాకింగ్గా ఉంది. ఆయన మరెవరో కాదు డైరెక్టర్ సురేంద్ర రెడ్డి. ఈ కెరియర్ లో మాత్రం హిట్లు కన్నా ఫ్లాప్లే ఎక్కువ. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ ఇలాంటి డైరెక్టర్ తో సినిమాను ఓకే చేశాడు ఏంటీ..? ఇలాంటి డైరెక్టర్ తో సినిమా కమిట్ అయ్యాడు ఏంటి..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు వెంకటేష్ చాలా చాలా తప్పుడు డెసీషన్ తీసుకున్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు వెంకటేష్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!