టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు ఉన్న త్రివిక్రమ్ పలు వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు.ఇప్పటికే పూనం కౌర్ టైం దొరికిన ప్రతిసారి త్రివిక్రమ్ ని సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తుంది. తనని మోసం చేశాడని ఆఫర్ల కోసం తనని వాడుకున్నాడని ఇలా ఎన్నో పరోక్ష కామెంట్లు చేస్తూనే ఉంటుంది.అయితే ఈ ఒక్కరే అనుకుంటే మరో హీరోయిన్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది.త్రివిక్రమ్ నన్ను నమ్మించి మోసం చేశాడంటూ ఈ హీరోయిన్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.మరి ఇంతకీ త్రివిక్రమ్ చేతిలో బలైపోయిన మరో హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.సీనియర్ నటి ప్రేమ అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయిన్. ఎందుకంటే ఈమె దేవి అభయం వంటి ఎన్నో సినిమాల్లో దేవత పాత్రలో నాగమ్మ తల్లి పాత్రలో నటించింది. 

అంతేకాకుండా కన్నడ నటుడు ఉపేంద్ర తో ప్రేమ హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక మోహన్ బాబు నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ప్రేమ నెగటివ్ పాత్రలో చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ నన్ను నమ్మించి మోసం చేశారు. నేను ఆయన మీద గట్టి నమ్మకం పెట్టుకొని ఆయన చెప్పిన స్టోరీ పూర్తిగా వినకుండానే సినిమాల్లో నటించాను. అలా తొట్టపూడి వేణు నటించిన చిరునవ్వుతో మూవీలో నాకు అవకాశం వచ్చింది.అయితే ఈ సినిమాలో నేను  మొదటి హీరోయినా లేక సెకండ్ హీరోయిన్ గా మార్చేస్తారా అని భయంతో ఇందులో నా పాత్ర ఏంటి అని డైరెక్టర్ని అడిగాను. దానికి ఆయన మీతో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఉంది మీరు కూడా ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పారు.

ఇక హీరోయిన్ రోలే కదా అని నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కానీ చిరునవ్వుతో మూవీ విడుదలయ్యాక నా పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ గానే తెర మీద కనిపించింది.దాంతో సినిమా విడుదలయ్యాక నాకు అసలు నిజం తెలిసి వచ్చింది.నేను త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఈ సినిమాలో స్టోరీ కూడా పూర్తిగా వినకుండానే ఒప్పుకుంటే చివరికి సినిమా విడుదల అయ్యాక ఈ సినిమాలో నా పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్ లో కనిపించడంతో ఈ సినిమా విడుదలయ్యాక నాకు అన్ని అలాంటి అవకాశాలు వచ్చాయి. కేవలం త్రివిక్రమ్ వల్లే నాకు ఇలా జరిగింది. అంతకుముందు నేను సినిమాలో హీరోయిన్ గానే చేశాను. కానీ త్రివిక్రమ్ సినిమా వల్లే నన్ను సపోర్టింగ్ ఆర్టిస్టుగా మార్చేశారు. ఆయనే నా జీవితాన్ని నాశనం చేశారు. త్రివిక్రమ్ తో చేసిన సినిమా వల్ల నా జీవితం సర్వనాశనమైంది అంటూ సీనియర్ నటి ప్రేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: