పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలామంది హీరోయిన్లకు ఒక పండగ.. ఎందుకంటే ఎంతోమంది నటీమణులు పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే చాలామంది హీరోయిన్లు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తే ఈ హీరోయిన్ మాత్రం వచ్చిన అవకాశాన్ని కాల తన్నినట్టు తెలుస్తోంది.తాజాగా ఓ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా చేయడానికి ఒప్పుకుంది. కానీ చివరికి ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమా నుండి తప్పుకున్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ జి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి మూడు సినిమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ 90% కంప్లీట్ అయిపోయింది. 

అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఈ రెండు సినిమాలలో ఓ సినిమా గురించి సంచలన న్యూస్ టాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే పవన్ కళ్యాణ్ సినిమా నుండి హీరోయిన్ తప్పకుందట. ఇక ఆ సినిమా ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని అనౌన్స్ చేశారు.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా శ్రీలీలను ఫిక్స్ చేశారు. అయితే సడన్గా ఈ సినిమా నుండి శ్రీ లీల తప్పుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వాయిదా పడ్డ సంగతి మనకు తెలిసిందే. ఓ పక్క ఓజికి మరోపక్క హరిహర వీరమల్లుకి డేట్స్ ఇచ్చినప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మాత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేదని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే శ్రీలీ  చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయట.దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ ఈ సినిమా స్టార్ట్ అవ్వడం లేదని వేరే సినిమాలకు ఒప్పుకుంటే మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ అయితే శ్రీలీలకు ఇబ్బంది.అందుకే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమా నుండి తప్పుకోబోతున్నట్టు నిర్మాతకి డైరెక్టర్ కి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ కి కాల్షీట్లు ఇచ్చినప్పటికీ సినిమా పరిస్థితి ఎటు కాకుండా ఉండడంతో సినిమా వదిలేయడమే మంచిది అని శ్రీలీల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి నిజంగానే పవన్ సినిమా నుండి శ్రీలీల తప్పకుందా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: