నయనతారకు బాగా తల పొగరు ఉంటుందని ఇండస్ట్రీలో ఉన్న చాలామంది మాట్లాడుకున్న మాటలే. ముఖ్యంగా నయనతార ఏ సినిమాలో చేసిన కూడా ఆ సినిమాలో చాలా కండిషన్లు పెడుతుందని, అలాగే కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకొని కనీసం ప్రమోషన్స్ కి కూడా రాదు అని సినిమా షూటింగ్ సెట్లో కూడా డైరెక్టర్ కి సరిగా స్పందించదు అనే టాక్ ఇండస్ట్రీలో ఉండనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే స్టేజి మీద ఓ స్టార్ హీరోయిన్ ని నయనతార అవమానించింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ నయనతార ఎవరిని అవమానించింది.. ఎందుకు అలా తల పొగరుగా ప్రవర్తించింది అనేది ఇప్పుడు చూద్దాం.. నయనతార ఓవైపు ఫ్యామిలీని మరోవైపు సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే కొన్ని బిజినెస్ లు కూడా చేస్తూ బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టి బిజీనెస్ ఉమెన్ గా బిజీయెస్ట్ హీరోయిన్గా బిజీయెస్ట్ ఉమెన్ గా పేరు తెచ్చుకుంటుంది.

 అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా స్టార్ హీరోయిన్ అవమానించింది అంటూ కోలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే సీనియర్ నటి మీనా.. రీసెంట్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది నటీనటులు కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఆ ఈవెంట్ లో నయనతార తో పాటు సీనియర్ నటి మీనా కూడా హాజరైందట.ఇక ఈ ఈవెంట్లో మీనా రావడంతోనే ఎంతోమంది హీరోయిన్లు ఆప్యాయంగా పలకరించారట. కానీ నయనతార మాత్రం చాలా పొగరుగా కనీసం పలకరించకుండా చూసి చూడనట్టుగా వదిలేసిందట. స్టేజ్ పైనే అలా అవమానించేసరికి మీనా కాస్త అసహనంగా ఫీల్ అయినట్టు కొన్ని ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ ఈవెంట్ జరిగిన కొద్దిసేపటికి సీనియర్ నటి మీనా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇక తన ఖాతాలో పెట్టిన పోస్ట్ ఏంటంటే.. సింహం గొర్రెల అభిప్రాయాన్ని అస్సలు పట్టించుకోదు అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టు నయనతారని ఉద్దేశించే మీనా చెప్పింది అని ఈ పోస్టులో సింహం మీనా అని గొర్రె నయనతార అంటూ చాలామంది నెటజన్లు మీనా చేసిన పోస్ట్ని వైరల్ చేస్తున్నారు. అయితే అంత మందిలో నయనతార మీనాని పలకరించకపోవడం వల్లే మీనా ఇలాంటి పోస్ట్ చేసింది అని వాదన కూడా తెరమీద వినిపిస్తోంది.ఇక నయనతార వైఖరి పట్ల చాలామంది నెటజన్స్ సైతం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: