
తాజాగా సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక శర్మ నటిస్తుంది. ఈ మూవీకి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. ప్రభాస్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చే అంతా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీ టీజర్ రిలీజ్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చిన విషయం తెలిసిందే. ట్రైలర్ ని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. పెళ్లి కాని ప్రసాద్ సినిమా థామ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమా మార్చి 21న థియేటర్ లలో విడుదల కానుంది.
అయితే ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సప్తగిరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'ఒట్టు వేసి చెప్తున్నాను సినిమా వాళ్లకు ఎవరూ పిల్లనివ్వరు. సినిమా వాళ్లకి ఎంత పేరు ఉన్న ఎంత మంచి అలవాట్లు ఉన్న సరే ఎవరు పిల్లని ఇవ్వడానికి ఇష్టపడరు. సినిమా వాడా అని అనేస్తారు' అని సప్తగిరి చెప్పుకొచ్చాడు.