ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారి పేర్లను, ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు. అమ్మాయిల విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లే ఇప్పుడు ముఖ్య పాత్రలో హీరోయిన్ గా చాలా సినిమాలలో కనిపిస్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్నారు. ఇక తాజాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో నేటింటా చాలా వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో ఎవరిది.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నారా.
 
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమా ఈ చిన్నారి కనిపించింది. ఈ చిన్నారి తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. అయితే ఆ చిన్నారి ఎవరంటే గ్లామరస్ హీరోయిన్ అనుష్క మల్హోత్రా. ఈమె డాడీ సినిమాలో చిరంజీవికి కూతురిగా నటించింది. అనుష్క అక్షయ, ఐశ్వర్య పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో అనుష్క ఎంతో క్యూట్ గా, ముద్దుగా ఉంటుంది. పెద్ద కళ్లతో, స్వీట్ స్మైల్ తో అభిమానులను సంపాదించుకుంది. ఈ చిన్నారి ఇప్పుడు పెద్దగా అయ్యి యూరప్ లో ఉంటుంది. ఈ సినిమాలో అనుష్క, చిరంజీవి కూతురిగా చాలా బాగా యాక్ట్ చేసింది. డాడీ సినిమాతో మంచి హిట్ ని కూడా అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సిమ్రాన్ నటించింది.


డాడీ సినిమాలో నటించినప్పుడు అనుష్క మల్హోత్రా వయసు నాలుగైదేళ్లు ఉండేది. ఇప్పుడు 27 ఏళ్లు అమ్మాయి. ఈమెకి ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి అంట. కానీ అనుష్క చదువు కోసం అని ఈమె తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీకి దూరం చేశారు అంట. ఈమె ప్రస్తుతం లండన్‌లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది అంట.    

మరింత సమాచారం తెలుసుకోండి: