వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ హీరోగా చేసిన తాజా మూవీ రాబిన్ హుడ్.ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుండి వచ్చిన అన్ని అప్డేట్స్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. అలా నితిన్ శ్రీలీల కాంబలో రాబోతున్న రాబిన్ హుడ్ మూవీ ఈనెల అనగా మార్చి 28న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు.ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల నితిన్ తో రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆమెకు భయపడ్డా అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.మరి ఇంతకీ శ్రీ లీల ఎవరికి భయపడింది అనేది ఇప్పుడు చూద్దాం. 

వెంకీ కుడుముల నితిన్ కాంబోలో మొదట భీష్మ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. ఇక నెక్స్ట్ సినిమాలో కూడా వెంకీ కుడుముల నితిన్ రష్మికనే హీరోయిన్గా తీసుకుందామని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంలో రష్మికమూవీ నుండి తప్పుకుందట.దాంతో ఈ హీరోయిన్ ప్లేస్ లో శ్రీలీలకు అవకాశం వచ్చింది.అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు పుష్ప-2లో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం శ్రీలీలకు వచ్చింది.ఇక షూటింగ్ సెట్ కి వెళ్లిన సమయంలో రష్మిక తో మాట్లాడడానికి శ్రీలిల చాలా భయపడిందట.

ఎందుకంటే నితిన్ తో చేసిన సినిమాలో రష్మిక ని రీప్లేస్ చేసి తనని పెట్టుకోవడంతో ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందోనని శ్రీలీల బయపడిందట. కానీ విషయం తెలుసుకున్న రష్మిక మాత్రం నేనే ఈ సినిమా నుండి తప్పుకున్నాను. నాకు ఈ సినిమా చేయడానికి డేట్స్ అడ్జస్ట్ కాలేదు. అందులో నీ తప్పేముంది అని ప్రేమగా పలకరించిందట. ఆ తర్వాత రష్మిక తో శ్రీలీల కలిసిపోయిందట.అలా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల బయటపెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: