టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా , నిర్మాతగా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన చాలా కాలం క్రితం హీరో గా కెరియర్ ను మొదలు పెట్టి ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించాడు. ఈయన నటించిన సినిమాలలో అనేక మూవీలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. దానితో ప్రస్తుతం నాని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాని చాలా సంవత్సరాల క్రితం నుండి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ఈయన ఇప్పటి వరకు సెలెక్టివ్ గా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఈయన నిర్మించిన సినిమాలలో కూడా అనేక మూవీలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో నిర్మాతగా కూడా నానికి మంచి గుర్తింపు వచ్చింది. నాని ఇప్పటికే హిట్ 1 , హిట్ 2 అనే సినిమాలను నిర్మించి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం హిట్ 3 అనే సినిమాలో హీరోగా నటిస్తూ , ఆ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇలా హిట్ యూనివర్స్ మాదిరిగానే మరో యూనివర్సిటీ మూవీలను కూడా నాని తీయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నాని "కోర్టు" అనే మూవీ ని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. నాని ప్రస్తుతం నిర్మిస్తున్న హిట్ యూనివర్స్ మాదిరిగానే కోర్టు యూనివర్స్ లో కూడా వరుస పెట్టి సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ఒక్కో మూవీ లో ఒక్కో కేసు ఉండబోతున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా నాని విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే నాని ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాను నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: