
అయితే జీ స్టూడియోస్ సొంతంగా సినిమాలను నిర్మించదు కాబట్టి దిల్ రాజు లేదా మరో టాప్ ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం పొందే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. బన్నీ అట్లీ కాంబో మూవీ, బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ పూర్తైన తర్వాత పుష్ప3 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. పుష్ప3 మూవీ సులువుగా 3000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పుష్ప ది ర్యాంపేజ్ సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పుష్ప2 ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన నేపథ్యంలో పుష్ప3 మూవీ సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. బన్నీ పారితోషికం సైతం రికార్డ్ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇతర స్టార్ హీరోలెవరూ డిమాండ్ చేయని స్థాయిలో బన్నీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో బన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు.