యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తున్న మొట్టమొదటి చిత్రం వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ కి దీటుగా ఎన్టీఆర్ నటించబోతున్నారనే టాక్ గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా అంతే శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే తెగ వైరల్ గా మారుతున్నది.


వార్ 2 సినిమా పైన సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా రిలీజ్ డేట్ పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తున్న ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని ప్రచారం జరుగుతున్న సందర్భంలో తాజా అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షెడ్యూల్ ఆగస్టు 14న గ్రాండ్ గా థియేటర్లలోని వార్ 2 చిత్రం రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నట్లుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ డేట్ నే ఫైనల్ చేసినట్లు త్వరలోనే చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా కూడా తెలియజేయబోతున్నట్లు సమాచారం.


చివరిగా ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని విడుదల చేయగా ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే ప్రాజెక్టుని మొదలుపెట్టారు. ఇటీవలే సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టడం చిత్రానికి సంబంధించి పోస్టర్లు కూడా లీక్ అయ్యాయి.. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్లు అయితే తెలియజేయలేదు. ఎన్టీఆర్ తన కెరియర్ లోని మొదటిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న వార్ 2 సినిమా కావడం చేత ఈ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందా అంటూ అభిమానులు ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: