తమిళ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి అశ్విత్ మరిముత్తు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది. దానితో ఈ మూవీ ఇప్పటికే సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ లాభాలను కూడా అందుకుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 23 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 23 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభాలను ఈ మూవీ అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

23 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి తమిళ నాడు ఏరియాలో 77.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.54 కోట్లు , కర్ణాటక ఏరియాలో 10.40 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.50 కోట్లు , ఓవర్సీస్ లో 34 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు 23 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 71.45 కోట్ల షేర్ ... 146.19 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ... ఈ మూవీ ఇప్పటి వరకు 41.45 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: