ఫిలిమ్ ఇండస్ట్రీలో కొత్త తరహా సినిమాలు చాల అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు ఊహించని ఘన విజయం సాధించినప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతూ అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ సినిమాలు తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాయలసీమా ఫ్యాక్షనిజం అక్క చెల్లి సెంటిమెంట్ లతో అనేక సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.


ఇలాంటి పరిస్థితులలో కేవలం కోర్ట్ డ్రామాగా వచ్చిన సినిమాలు కొన్ని సక్సస్ అయితే చాల వరకు ఫెయిల్ అయిన సందర్భాలు అనేకం. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ విజయం సాధించినప్పటికీ అది ఘన విజయాన్ని సాధించలేదు. గతంలో చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని కోర్ట్ సీన్స్ బాగా పాప్లర్ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి కోర్ట్ సీన్ సినిమాలు ఎక్కువగా హిందీలో మళయాళంలో వచ్చి గతంలో ఘనవిజయాలు సాధించిన సందర్భాలు అనేకం.


ఎటువంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా కొత్త హీరో కొత్త హీరోయిన్ ఒకనాటి హీరో సరికొత్త విలన్ గా మారిన నటీనటులను నమ్ముకుని ఒక కొత్త దర్శకుడుతో నాని చేసిన సాహసం ప్రస్తుతం నానీకి అదేవిధంగా ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లకు కనక వర్షాన్ని ‘కోర్ట్’ కురిపిస్తోంది. అతి తక్కువ బడ్జెట్ తో నాని నిర్మాతగా చేసిన సాహసానికి ప్రశంసలతో పాటు కలక్షన్స్ హోరెత్తి పోతున్నాయి. ఈసినిమా విడుదలకు ముందు నాని చేసిన శపదం నిజం కావడంతో నిర్మాతగా నాని జడ్జ్మెంట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. దీనితో చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ను వెనక్కు తీసుకు వెళ్లిపోయాయి. అయినప్పటికీ ధైర్యంగా నాని ముందుకు వచ్చాడు. ఈసినిమాను విపరీతంగ ప్రమోట్ చేశాడు. ఈసినిమా కోసం కెరీర్ కోసం శపదాలు కూడా చేశాడు. మొదట్లో ఆశపదాలు విని చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ ‘కోర్ట్’ మూవీ సూపర్ సక్సస్ కావడంతో ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ తెలుగులో మరన్ని కోర్ట్ డ్రామా సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: