టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఇప్పటికే సూపర్ సాలిడ్ విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని మార్చి 21 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్లు కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ కి టికెట్ బుకింగ్స్ విషయంలో అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మొదటి రోజుకి సంబంధించిన 60 వేల టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ మూవీ కి మొదటి రోజు 80 లక్షల రేంజ్ లో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కొంత మంది అంచనా వేస్తున్నారు. ఇలా సలార్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకునే అవకాశాలు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: