
ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీని చూసిన వారు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో శివాజీ పోషించిన విలన్ పాత్రను చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ‘మిస్సమ్మ’ సినిమాలో ఎంతో అమాయకంగా నటించి అందరి మెప్పు పొందిన శివాజీ ఒక రేంజ్ లో కరుడుకట్టిన సంపద వర్గానికి చెందిన విలన్ గా నటించిన అతడి నటనను చూసి విమర్శకులతో పాటు సగటు ప్రేక్షకులు కూడ షాక్ అవుతున్నారు.
వాస్తవానికి శివాజీ సినిమాలలో నటించిన సందర్భాలు చాల తక్కువగా ఉంటున్నాయి. దీనికితోడు కొన్ని సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమాలలో రాజకీయాలలో తన సత్తా చాటాలని శివాజీ చాల గట్టిగా ప్రయత్నాలు చేశాడు. అయితే ఆప్రయత్నాలు ఏమి అతడికి కలిసిరాలేదు. దీనితో తిరిగి యూటర్న్ తీసుకుని నటుడుగా తన ప్రతిభ ఏమాత్రం తగ్గిపోలేదనీ ‘కోర్ట్’ మూవీతో మరొకసారి చేసిన ప్రయత్నం అందరికీ బాగా నచ్చడంతో శివాజీకి మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది.
‘కోర్ట్’ మూవీని చూసినవారు అతడు పోషించిన మంగపతి పాత్రను మర్చిపోలేకపోతున్నారు ప్రేక్షకులు శివాజీ అభిమానులు. ఇది ఇలా ఉండగా శివాజీ నిర్మాతగా మారి ఒక మూవీ తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమూవీ కూడ హిట్ అయితే ఇక శివాజీ కెరియర్ కు తిరుగులేదు అనుకోవాలి..