2024లో ఎన్నో రకాల సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. అందులో పుష్ప-2 సినిమా ఒకటి. ఈ సినిమా డిసెంబర్ 5, 2024లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. కాగా, పుష్ప సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీయగా ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.


అయితే ఈ సినిమా చివర్లో పుష్ప-3 సినిమా కూడా ఉంటుందని ఎండింగ్ లో ప్రతి ఒక్కరం చూసాం. కాగా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే అంశం ఇంతవరకు తెలియలేదు. అయితే పుష్ప-3 సినిమాను 2028 సంవత్సరంలో విడుదల చేస్తామని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ అనౌన్స్ చేశారు. రీసెంట్ గా విజయవాడలో జరిగిన "రాబిన్ హుడ్" ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నారని వెల్లడించాడు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో రిలీజ్ అయిన పుష్ప, 2024లో రిలీజ్ అయిన పుష్ప-2 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయని చెప్పాడు.



అంతేకాకుండా పుష్ప-2 సినిమా రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లను కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప-3 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని రవిశంకర్ వెల్లడించారు. అయితే పుష్ప-3 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. అయితే పుష్ప-3 సినిమాలో సమంత మరోసారి ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లుగా సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.


పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేయడంతో ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. ఇక పుష్ప-2లో శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక పుష్ప-3లో సమంత ఐటెమ్ సాంగ్ చేయబోతుందని తెలిసి అల్లు అర్జున్, సమంత అభిమానులు సంబరపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించాలని కోరుతున్నారు. ఇక ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: