న్యాచురల్ స్టార్ నాని నిర్మాత గా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. పెయిడ్ ప్రిమియర్స్ తోనే ఈ చిత్రం యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది.. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది..థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. నిర్మాతగా నానికి కోర్ట్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చేరింది..

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు.ఈ సక్సెస్ మీట్ లో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు..కోర్ట్ మూవీ లవ్ స్టోరీ యాంగిల్‌ లో లేదు.. ఒకవేళ లవ్ యాంగిల్ కావాలంటే సీక్వెల్‌లో సింక్ చేసుకోవచ్చు అని నాని అన్నారు...సీక్వెల్ టాపిక్ రాగానే వెనుక నుంచి ప్రియదర్శి సీక్వెల్ ఉందా అన్నా అని అడుగుతాడు... దానికి బదులుగా నాని 'ఏమో చెప్పలేం  ఇప్పుడు కోర్ట్ సినిమా బయట కుమ్మేస్తుంది. ఇదే ఫ్లో లో సీక్వెల్ కనుక తీశామంటే పాన్ ఇండియా సినిమా అయిపోతుంది అని నాని అన్నారు..

ఇప్పుడు అంతా చిన్న సినిమా అంటున్నారు కానీ ఇప్పుడు వచ్చిన ట్రెండ్ బట్టి  సీక్వెల్ అని అనౌన్స్ చేశామంటే 'కోర్ట్' చాలా పెద్ద సినిమా అయిపోతుంది అని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇలాంటి సినిమాలకు కచ్చితంగా సీక్వెల్ రావాలి తప్పకుండా ట్రై చెయ్యండి నాని బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే కోర్ట్ సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకు 15 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించింది..


మరింత సమాచారం తెలుసుకోండి: