రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి సీరీస్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి అనుష్క , తమన్నా హీరోయిన్లుగా నటించగా ... గ్రేట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయేంద్ర ప్రసాద్మూవీ కి కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమాలో మొదటి భాగం అయినటువంటి బాహుబలి ది బిగినింగ్ మూవీ ని 2015 వ సంవత్సరం జూలై 10 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి సంవత్సరం జూలై 10 వ తేదీతో 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇలా ఈ మూవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ మూవీ ని మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేయాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు , అందుకు అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన చాలా సినిమాలకు మంచి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. దానితో బాహుబలి ది బిగినింగ్ మూవీ కి కూడా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: