రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దాదాపుగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో ధోని నటిస్తున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
 
వైరల్ అవుతున్న వార్త సినిమాపై అంచనాలను సైతం భారీ స్థాయిలో పెంచేసింది. అయితే రామ్ చరణ్ వైపు నుంచి ఈ గాసిప్ కు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. చరణ్ ధోనీ మంచి స్నేహితులు కావడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయని చెప్పవచ్చు. ధోనీకి సూటయ్యే పాత్ర కూడా తమ సినిమాలో లేదని చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చేసింది. ఈ క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది.
 
చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీకి అదిరిపోయే రోల్ దక్కిందని ఆమె కెరీర్ బెస్ట్ రోల్స్ లో ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ బుచ్చిబాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఇండస్ట్రీని షేక్ చేయాలని అభిమానులు భావిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. రామ్ చరణ్ గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. చరణ్ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: