నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూ అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాడు. అలాగే మరో వైపు మూవీలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా విజయాలను అందుకుంటున్నాడు. ఆఖరుగా ఈయన సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా ఈయన కోర్టు అనే మూవీ ని నిర్మించి ఈ మూవీ తో కూడా అద్భుతమైన సక్సెస్ను సొంతం చేసుకున్నాడు. నాని చాలా సంవత్సరాల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.

ఈ మూవీతోనే నాగ్ అశ్విన్ దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. కృష్ణం రాజు ఈ మూవీ లో ఓ చిన్న పాత్రలో నటించాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన ఈ సినిమాను మళ్ళీ తిరిగి థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 21 వ తేదీన రీ రిలీస్ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్లు కూడా ఓపెన్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన అనేక తెలుగు సినిమాలు మంచి కలక్షన్లను వసూలు చేశాయి. మరి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఏ స్థాయి కలెక్షన్లను రీ రిలీజ్ లో భాగంగా వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: