నటుడిగా , యాంకర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రదీప్ మచిరాజు ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అనేక బుల్లి తెర అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ప్రదీప్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు. ఇకపోతే 2021 వ సంవత్సరంలో ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా ద్వారా ప్రదీప్ కి భారీ అపజయం దక్కింది. ఇక 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ఈయన చాలా కాలం గ్యాప్ తీసుకుని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా టైటిల్ ను ప్రదీప్ తన సినిమాకు పెట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ మొదలు అయింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని ఏప్రిల్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో అపజయాన్ని అందుకున్న ప్రదీప్ "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: