సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ ని నెగిటివ్ షేడ్స్ లో చూపించాలి అంటే  డైరెక్టర్ లు గజగజ వణికి పోతారు.  దానికి కారణం ఫ్యాన్స్ . ఫ్యాన్స్ వాళ్ల ఫేవరెట్ హీరోని హీరోగా కన్నా కూడా దేవుడిలా ఆరాధిస్తూ అభిమానిస్తూ ఉంటారు . ఆ విషయం అందరికీ తెలిసిందే.  మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ డైరెక్టర్స్ స్పెషల్ స్పెషల్ కథలను రాసుకున్నప్పుడు .. ఆ కథలో కొన్ని నెగిటివ్ షేడ్స్ ఆ హీరోలు చూపించాలి అని అనుకున్న కూడా భయపడిపోతూ ఉంటారు.


ఆ లిస్టులోకే వస్తాడు డైరెక్టర్ బాబి . రీసెంట్ గానే నందమూరి బాలయ్యతో "డాకు మహారాజ్" అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బాబి .. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో "జై లవకుశ" అనే సినిమాను తెరకెక్కించాడు . ఈ సినిమాలో ఎన్టీఆర్ కొంచెం నెగిటివ్ షేడ్శ్ లో కూడా కనిపిస్తాడు . అయితే నిజానికి ఈ క్యారెక్టర్ ని ముందుగా బాబి రామ్ చరణ్ తో అనుకున్నాడట . రామ్ చరణ్ కి కథ కూడా వివరించారట . కానీ నెగటివ్ షేడ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఊరుకోనే ఊరుకోరు అంటూ ఆయన ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట .



బాబీ కూడా కూసింత వెనకడుగు వేశారట. నిజానికి  ఎన్టీఆర్ తో స్టోరీ వివరించే టైంలో కూడా ఎన్టీఆర్ అదే విధంగా మాట్లాడాడట. కానీ ఆయన తన లైఫ్ లో అన్ని రోల్స్  చేయగలగాలి అన్న కోరిక తీర్చుకోవడానికి ఇలా ఈ సినిమాకు కమిట్ అయ్యాడట . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అలా రామ్ చరణ్ నెగిటివ్ స్టేట్స్ లో కనిపించాల్సిన పాత్రను మిస్ చేసుకున్నట్లయింది. ప్రసెంట్ రామ్ చరణ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో బిజీబిజీగా నటిస్తూ ఉన్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: