మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో విజయాలను అందుకొని మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ లో మోహన్ లాల్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో కూడా లభించింది. ఇకపోతే తాజాగా మోహన్ లాల్ , పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన L2 : ఎంపురాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ కి సంబంధించిన నార్త్ ఇండియా థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా థియేటర్ హక్కులను ఏ ఏ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ సంస్థ ఈ సినిమాను నార్త్ ఇండియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ నార్త్ ఇండియా హక్కులను కూడా ఏ ఏ సంస్థ వారే దక్కించుకున్నారు. అలాగే గేమ్ చెంజర్ మూవీ నార్త్ ఇండియా హక్కులను కూడా ఈ సంస్థ వారే దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: