రమ్యకృష్ణ.. ఈ పేరు కి ఓ పెద్ద బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. సాధారణంగా చాలా మంది హీరోస్ కి బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. ఆ పేరు చెప్పే ముందు పెద్ద చరిత్రే చెప్పుతారు. కానీ హీరోయిన్స్ విషయంలో అది రేర్. కాగా  సినీ ఇండస్ట్రీలో ఒక సీనియర్ హీరోయిన్ గా రమ్య కృష్ణ ఎంత పెద్ద స్టార్ గా ఎదిగింది అనేది అందరికి తెలుసు.  రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఏ మూవీకి కమిట్ అయినా సరే తన రోల్ చాలా ప్రత్యేకంగా ఉంచుకుంటూ ఉంటుంది.


మరీ ముఖ్యంగా ఆమె కమిట్ అయిన లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి . హీరో లేకపోయినా సరే హీరోయిన్గా నటించి క్రేజీ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సూపర్ డూపర్ గా తన కెరీర్ ని మలిచేసుకుంటూ ఉంటుంది . ఆమె నటించిన సినిమాలు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ రమ్యకృష్ణ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .
ప్రజెంట్ హీరోయిన్  రమ్యకృష్ణ సినిమాలకు దూరంగా ఉంది . తెలుగులో ఆమె ఆఖరిగా నటించింది "గుంటూరు కారం".  ఆ తర్వాత మంచి మంచి ఆఫర్స్ వచ్చినా సరే ఆమె తెరపై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపియలేదు . కొంతమంది ఈమెకు ఆరోగ్యం బాగోలేదని కూడా మాట్లాడుకున్నారు . కానీ ఆమెకు కొన్ని క్యారెక్టర్  నచ్చని కారణంగానే ఇలా దూరంగా ఉండిపోయిందట . కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా టైం గ్యాప్ తర్వాత మళ్లీ మహేష్ బాబు సినిమాలోనే కనిపించబోతుందట . ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే . రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే సినిమాలో  రమ్యకృష్ణ కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతుందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: