
అలా డేవిడ్ వార్నర్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యారు. దీంతో ఈ క్రికెటర్ క్రేజ్ ని సైతం రాబిన్ హుడ్ చిత్ర బృందం క్యాష్ చేసుకొని అందులో ఒక కీలకమైన పాత్ర చేయించేలా చేసింది. అయితే ఈ పాత్ర కోసం డేవిడ్ వార్నర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ఇందుకు సంబంధించి ఒక న్యూస్ అయితే వినిపిస్తోంది. ఆయన నాలుగు రోజులపాటు సినిమా షూటింగ్లో పాల్గొన్నారనీ ఇందుకోసం రూ .3కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం అదనంగా మరొక కోటి రూపాయలు తీసుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ లోని డాన్స్ సన్నివేశాలతో వివాదాలతో రాబిన్ హుడ్ చిత్రం బాగానే క్రేజీ సంపాదించింది.. ఇప్పుడు డేవిడ్ వార్నర్ పోస్టర్తో మరింత హైప్ సంపాదించుకున్న రాబిన్హుడ్ చిత్రం ఈనెల 28వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. గతంలో నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన భీష్మ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఆ తర్వాత వీరి కాంబినేషన్లో రాబిన్ హుడ్ సినిమా రావడం జరుగుతోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.