ప్ర‌స్తుతం ఉన్న రోజుల్లో రిలీజ్ కి ముందే సినిమాలని సేఫ్ జోన్ లో పెట్టుకోవడం చాలా అరుదైన విషయం గా మారిపోతుంది .. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీ డీల్స్ కుదరక ఎంతో ఇబ్బంది పడుతున్నాయి .. ఆ సినిమాలు చూస్తే తప్ప కొనమని ఓటీటీలు భీష్ముంచుకుని కూర్చుంటున్నాయి .. దీంతో నిర్మాతలకు తిప్పలు తప్పడం లేదు .. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమన్నా సినిమా ఓటీటీ డీల్ మంచిగా కుదిరింది .. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓదెల 2 సంపత్ నంది ఈ సినిమాకు నిర్మాత ..


ఓదెల రైల్వే స్టేషన్ ఓటీటీలో పెద్ద హిట్ అయింది .. ఆ క్రేజ్ తోను తెరకెక్కిస్తున్నారు .. ఈసారి స్టార్ క్యాస్ట్ గా మారింది .. స్టార్ టెక్నీషియన్లు వచ్చి ఈ సినిమాకు పనిచేస్తున్నారు .. క్వాలిటీ కూడా బాగా పెరిగింది .. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ మార్కెట్ వర్గాలని మంచిగా ఆకట్టుకుంది .. ఇక దీంతో ఓటీటీ డీల్ క్లోజ్ అయింది .. అమెజాన్ సంస్థ 12 కోట్లకు ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది .  హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా 6 కోట్ల వరకు అమ్మేశారు .. శాటిలైట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ..


ఇలా ఈ సినిమా మొత్తం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది .. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపం లోని అంతా వచ్చేసినట్టే .. ఇక థియేటర్ నుంచి వచ్చిందంట లాభమే .. ఇప్పటికే ఓదెల 2 షూటింగ్ దాదాపు పూర్తయింది .. ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారు .. ఈ నెలాఖరు నుంచి ప్రమోషన్లు మొదలు పెట్టాలని చిత్ర‌ యూనిట్ భావిస్తుంది .. తెలుగులో ఓ మంచి హిట్ కోసం తమన్నా ఎంతో ఆస్తి గా ఎదురు చూస్తుంది .. ఓదెల 2 తో తన ప్రయత్నం పాలించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: