రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా తెర్కెత్తుతున్న విషయం తెలిసిందే . మైత్రి మూవీస్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తుంది .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర పూర్తి చేశారు . అయితే ఈ సినిమాకి సంబంధించిన ప‌లు ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి .. ఇది ఓ స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విషయమే .. అయితే ఓ ఆట నేపథ్యం లో ఈ సినిమా వస్తుందని విషయం లో ఇలాంటి క్లారిటీ లేదు .


క్రికెట్ కబడ్డీ , కుస్తీల దాదాపు అన్ని ఆటలు ఈ సినిమాలు కనిపిస్తాయట .. హీరో ఆట కూలీగా నటించబోతున్నారని తెలుస్తుంది ... మనకు మామూలు కూలీలు తెలుసు కానీ ఆట కూలీల గురించి తెలియదు .. ఐపీఎల్ లో ఆటగాలని ఎలా కొనుక్కుంటారో అలా కొంత మందిని కొనుక్కుని ఓ జట్టుగా తయారుచేసి ఆటలు ఆడిస్తూ ఉంటారు .. అలా ఆడినందుకు రోజుకు కొంత అని డబ్బులు ఇస్తారు .. అది ఆటకూలి అంటే అలాంటి ఆటగాడిగా చరణ్ నటించబోతున్నాడని తెలుస్తుంది.. ఇప్పటికే క్రికెట్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెర్కక్కించారు .


అలాగే ఈ సినిమాలో ధోని కూడా నటిస్తున్నారని వార్త కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది . ఇక ధోనికి ఉన్న పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. నిజంగానే ధోని గనక ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా క్రేజ్ మైలేజ్ మరోలా ఉంటుంది .. పైగా ఇది స్పోర్ట్స్ డ్రామా ధోని నటించే ఛాన్స్ ని కొట్టిపారేయ‌లేం ఇప్పటికే రాబిన్ వుడ్‌ లో క్రికెటర్ వార్నర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు .. ఇక దీంతో ఈ సినిమా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు .. అదే ధోని లాంటి స్టార్ క్రికెటర్ కనిపిస్తే ఆ రచ్చ మరోలా ఉంటుంది .. మరి ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: