శతమానం భవతి సినిమా కోసం మొదటిసారి జతకట్టారు శర్వానంద్ , అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ .. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది .. ఆ తర్వాత మళ్లీ చాలా రోజుల కు వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారు .. శర్వానంద్ హీరో గా సంపత్ నంది దర్శకత్వం లో ఓ సినిమా రాబోతుంది .. ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు  కాబోతోంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో హీరోయిన్ గా అనుపమని తీసుకోబోతున్నార ని తెలుస్తుంది .. రీసెంట్ గానే సినిమా యూనిట్ కూడా అనుపమ ను సంప్రదించింది .. అయితే ఈ సినిమా లో నటించడాని కి ఆమె ఓకే కూడా చెప్పారట .. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలో నే బయటకు రానున్నాయి .


ఇక రీసెంట్ గానే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీలో నటించిన అనుపమ ఆ సినిమా లో తన పాత్ర చిన్నది అయిన యూత్ ని బాగా కట్టిపడేసింది .. ఇక దీంతో ఇప్పుడు మరోసారి టాలీవుడ్ దృష్టి అనుపమ పై పడింది .. శరవానంద్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి . నారి నారి నడుమ మురారి తో పాటు  అభిలాష్ అనే కొత్త ద‌ర్శ‌కుడి తో ఓ సినిమా కూడా చేస్తున్నారు .  ఈ రెండు సినిమాలు షూటింగులు సమాంతరం గా జరుగుతున్నా .. అయితే ఇందులో నారి నారి దాదాపు గా కంప్లీట్ కావొచ్చింది ... అందుకే ఇప్పుడు సంపత్ నంది సినిమా కి ఒకే చెప్పారు . ఇక సంప‌త్ నంది ఈ లోగా ఓదెల 2 అనే సినిమాని పూర్తి చేస్తారు .. ఈ ప్రాజెక్టు కు అయిన నిర్మాత మాత్రమే .. తమన్న ప్రధాన పాత్రలో నటిస్తుంది .. అలాగే ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కు రెడీగా ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: