
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తూ చిత్ర బృందం తాజాగా టీజర్ ని కూడా రిలీజ్ చేసింది. టీజర్ విషయానికి వస్తే.. ఎన్కౌంటర్ చేస్తూ విజయశాంతిని చూపించారు.. ఆ తర్వాత విజయశాంతి ఇలా డైలాగ్ చెబుతూ తన పదేళ్ల కెరియర్ లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్.. కానీ చావుకు ఎదురు వెళుతున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం తన కొడుకు అర్జున్ అనే డైలాగుని చెబుతుంది.. ఆ తర్వాతే కళ్యాణ్ రామ్ ఎంట్రీ చూపించారు. ఇందులో కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడుకుగా అద్భుతంగా నటించినట్లు కనిపిస్తోంది.
ఎమోషనల్ తో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. పోలీసులకు, రౌడీలకు మధ్య జరిగే సన్నివేశాలను కూడా ఇందులో చాలా హైలైట్ చేస్తూ చేపించారు. కళ్యాణ్ రామ్ ఇందులో మరింత వైలెంట్ గా కనిపించారు. కళ్యాణ్ రామ్ రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు.. నల్లకోట్లతో కాదు.. ఈ అర్జున్ విశ్వనాధ్ కనుసైగలతో శాసిస్తాయి అనే చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. విజయశాంతి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాత్రలలో ఎలా కనిపించిందో ఇందులో కూడా అలాగే కనిపించేలా కనిపిస్తోంది.. మొత్తానికి తల్లి కొడుకు సెంటిమెంటుతో అర్జున్ సన్నాఫ్ విజయశాంతి టీజర్ బాగానే ఆకట్టుకుటోంది.