టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇకపోతే ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత ఈయన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే మూవీలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే కొంత కాలం క్రితం కిరణ్ అబ్బవరం "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు నుండి కిరణ్ అబ్బవరం ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వేళ "క" సినిమా కనుక విజయం సాధించకపోతే తాను సినిమాలనే వదిలేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దానితో ఆ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దానితో కిరణ్ అబ్బవరం కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు దుల్రబా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్లో విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతుంది. ఇది ఇలా ఉంటే "క" మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.45 కోట్ల కలెక్షన్ లు ధక్కగా ... దిల్రుబా మూవీకి కేవలం 45 లక్షల కలెక్షన్లు మాత్రమే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో దక్కాయి. దానితో అనేక మంది "క" సక్సెస్ కిరణ్ కాలేకపోయాడు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: