నిహారిక.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  మెగా బ్రదర్ గా పాపులారిటి సంపాదించుకున్న నాగబాబు కూతురు . నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నింది.  సినిమా ఇండస్ట్రీలో మాత్రం క్లిక్ అవ్వలేకపోయింది . నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది . కానీ హిట్ కొట్టలేకపోయింది . క్లిక్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకునేసింది.  మ్యారీడ్ లైఫ్ లోనూసక్సెస్ కాలేకపోయింది . భర్తకు విడాకులు ఇచ్చేసింది.


ఇప్పుడు నిహారిక భర్తకు విడాకులు ఇచ్చేసి తన లైఫ్ తనది అంటూ బ్రతికేస్తుంది . మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్ తో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. నిహారిక - వితికా సెరు - యూట్యూబర్ నిఖిల్ - అదేవిధంగా యూట్యూబర్ మహాతల్లి మంచి మంచి ఫ్రెండ్స్ . ఎక్కడికి వెళ్లినా సరే నలుగురు కలిసి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు . వీళ్ళకి సంబంధించిన పిక్స్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. కాగా రీసెంట్గా యూట్యూబర్ మహాతల్లి పండు లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.



ఈ విషయాన్ని అఫీషియల్ గా ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.  దీనితో సోషల్ మీడియా వేదికగా ఆమెకు విషెస్ అందిస్తున్నారు జనాలు . ఇదే మూమెంట్లో నిహారిక సైతం ఫుల్ ఎక్సైట్ మెంట్ తో హ్యాపీగా ఉంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . నిహారిక - మహాతల్లి చాలా చాలా మంచి ఫ్రెండ్స్. ఆమె ప్రెగ్నెన్సీ మూమెంట్లోనూ చాలా చాలా ఫొటోస్ ట్రెండ్ అయ్యాయి నిహారికను మహాతల్లి సిస్టర్ ల చూసుకుంటుంది . ఈ క్రమంలోనే  నిహారిక పిన్ని అయిపోయిందోచ్..అంటూ రకరకాలుగా జనాలు కామెంట్స్ పెడుతున్నారు.  నిహారిక సైతం మహాతల్లి బేబీని చాలా స్పెషల్ గా లైక్ చేస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు . నిహారికకి మొదటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం . ఇదే విషయాని  ఓ ఇంటర్వ్యూ లో కూడా బయటపెట్టింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: