
మన ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు సినిమా గేమ్ ఛేంజింగ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అందరం ముందుగా చెప్పుకోవాల్సింది రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమా అనే చెప్పాలి. బాహుబలి సినిమా రిలీజ్ కు ముందు వరకు ఉన్న తెలుగు సినిమా వేరు ... ఆ సినిమా తర్వాత వచ్చిన తెలుగు సినిమా వేరు అన్నట్టుగా సరిహద్దులు చెరిపేసింది. బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజ్ అయ్యాక మన తెలుగు సినిమా మార్కెట్‌ను ఇది చెరిపేసిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మార్కెట్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఈ సినిమా ఆ రోజుల్లోనే అంటే పదేళ్ల క్రితమే ఏకంగా రు. 600 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి సినిమాకు కంటిన్యూగా తెరకెక్కిన బాహుబలి 2 - ది కంక్లూజన్ 2017 లో రిలీజ్ అయ్యి ఏకంగా రు. 1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా దెబ్బకు ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లి పోయింది. ప్రభాస్ దెబ్బకు నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక ఇప్పుడు బాహుబలి 1 రిలీజ్ అయిన పదేళ్లకు తిరిగి రీ రిలీజ్ కాబోతోందట. ఇది నిజంగా నే తెలుగు సినీ లవర్స్‌కు గుడ్ న్యూస్ అని చెప్పాలి.
బాహుబలి 1 సినిమా 2015 జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సెన్షేషనల్ విజయం సాధించింది. ఈ డేట్‌కు సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ 2025లో అదే డేట్ కి విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ స్పెషల్ డేట్ లో వచ్చే ఈ సినిమా ఇపుడు ఉన్న రీ రిలీజ్ ట్రెండ్ లో డెఫినెట్ గా భారీగా రికార్డులు సెట్ చేస్తుందన్న అంచనాలు అయితే గట్టిగా నే ఉన్నాయి.