
ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా.... మహేష్ బాబు సినిమాలలో నటిస్తున్న సమయంలోనే నటి నమ్రతను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కాగా, వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో నటించారు. అప్పటికి మహేష్ బాబు నటించిన మూడవ చిత్రం వంశీ కావడం విశేషం.
ఈ సినిమాను బి.గోపాల్ తెరకెక్కించారు. అయితే ఇందులోని నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా చేసింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వంశీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలోనే మహేష్, నమ్రత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. ఈ సినిమా షూటింగ్ కోసం నమ్రత, మహేష్ బాబు న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడ 25 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
సినిమా పూర్తయ్యే సమయానికి మళ్లీ కలుస్తామో లేదో అని అనుకొని ఒకరికొకరు వారికి మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని చెప్పుకున్నారట. అంతే ఆలస్యం చేయకుండా ఈ జంట వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. వివాహం తర్వాత నమ్రత సినిమాలు పూర్తిగా మానేసింది. తన భర్త, పిల్లలతో సమయాన్ని గడిపింది. ప్రస్తుతం నమ్రత బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. మహేష్ బాబు ఎప్పటిలానే సినిమాలు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్నారు.