మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం చరణ్ , బుచ్చబాబు సనా దర్శకత్వంలో RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ , చరణ్ కు జోడిగా కనిపించనుండగా ... కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక జగపతిబాబు కూడా ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఈ మూవీ లో మేఘన రాజ్ సర్జ ఓ కిలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈ బ్యూటీ తాజాగా ఈ మూవీ షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మలయాళ , తమిళ్ , కన్నడ మరియు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో ఈ బ్యూటీ బెండ్ అప్పారావు RMP సినిమాలో నటించింది. ఇక RC 16 మూవీ కనుక మంచి విజయం సాధించినట్లయితే ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: