
దీంతో బుల్లి రాజుకు పలు చిత్రాలలో నటించే అవకాశాలు వెల్లుబడ్డాయి. ఈ చైల్డ్ యాక్టర్ టాలెంట్ కారణంగా రెమ్యూనికేషన్ ఒక్కసారిగా అందరి అంచనాలను మించి పోయేలా పెంచేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం బుల్లి రాజు ఒక్క రోజుకు ఏకంగా లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ బుల్లి రాజు రెమ్యూనరేషన్ చూసి చాలామంది చిన్న నటీనటులు సైతం ఆశ్చర్యపోతున్నారట. సాధారణంగా చిన్నపిల్లల నటనకు ఇంతటి రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బుల్లి రాజుకు గుర్తింపు రావడంతో ఇప్పుడు టాప్ కమెడియన్ లెవెల్ లో పేరు సంపాదించారని..సినిమాలు, వెబ్ సిరీస్లలో 15 ప్రాజెక్టులు వచ్చినా కూడా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోందట. తన పది రోజులు కాల్ సీట్లకు పది లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే డైరెక్టర్ అనిల్ రావు పూడి కూడా బుల్లి రాజుకు మరొకసారి అవకాశం కల్పించినట్లు సమాచారం చిరంజీవితో నటించే సినిమాలో ఈ చైల్డ్ యాక్టర్ ని తీసుకుంటున్నారట. మరి చైల్డ్ యాక్టర్ రెమ్యూనరేషన్ పై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.