దేవుడు కరుణిచ్చిన పూజారి కరుణించలేదు అనే ఒక సామెత వినే ఉంటారు . ఆ సామెత ఇప్పుడు నాగార్జునకి బాగా బాగా సూట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ గురించి గుడ్ న్యూస్ లు వినిపిస్తున్న సరే సోషల్ మీడియాలో మాత్రం అడపాదడపా నెగిటివ్ టాక్ వైరల్ అవుతూనే వచ్చింది . రీసెంట్ గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మరొకసారి నాగార్జునకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.  


రీసెంట్ గానే అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లని రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా సింపుల్ గా జరిగింది.  పూర్తిగా సాంప్రదాయబద్ధంగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు . ఫ్యామిలీ లైఫ్ ను అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు . అయితే ఇప్పుడు అక్కినేని అఖిల్ పెళ్లి ఎప్పుడు జరగబోతుంది అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చాలామంది మార్చి 24వ తేదీ అఖిల్ అక్కినేని పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు విన్నారు. .



అలాగే వార్తలు ట్రెండ్ అయ్యాయి. వైరల్ అయ్యాయి. త్వరలోనే మార్చి 24 వ తేదీ రాబోతుంది . అయితే ఎటువంటి ప్రకటన అఖిల్ పెళ్లికి సంబంధించిన రాకపోవడంతో ఈ పెళ్లి ఆగిపోయింది అని కొందరు .. మరికొందరు  పెళ్లి పోస్ట్ పోన్ అయింది అని .. మరి కొందరు అసలు వీళ్ళు ఏ విషయాన్ని బయటకు చెప్పరు అక్కినేని ఫ్యామిలీ మొత్తం గుడుపుటని నడుపుతుంది అని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు . అసలు వీళ్ళు మార్చి 24వ తేదీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారో లేదో తెలియదు కానీ .. ఆ ముహూర్తం వైరల్ అయింది . పోనీ అక్కినేని నాగార్జున అది ఫేక్ అంటూ కొట్టి పడేసాడా..? అంటే అది లేదు . ఇప్పుడు సోషల్ మీడియాలో అఖిల్ అక్కినేని పెళ్లి పై రక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి . దీంతో నాగార్జునకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయినట్లయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: