
క్రిష్ ప్రస్తుతం అనుష్కతో ఘాటీ అనే సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కూడా ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ సమయానికి రిలీజ్ కావడం లేదు. డైరెక్టర్ క్రిష్ జాతకం అస్సలు బాలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. క్రిష్ ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాల్సి ఉంది. అనుష్క పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నా ఆ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి.
అనుష్క ఘాటీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండటం ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. అనుష్క క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మాత్రం మామూలు స్థాయిలో లేవు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే అనుష్కకు తిరుగులేదని కచ్చితంగా చెప్పవచ్చు.
అనుష్కకు సెకండ్ ఇన్నింగ్స్ కూడా బాగానే కలిసొస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ అనుష్క కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. అనుష్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవ్గుతున్నారు. అనుష్కను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అనుష్క మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. డైరెక్టర్ క్రిష్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. భవిష్యత్తు సినిమాలతో క్రిష్ ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.