
అల్లరి నరేష్ హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం 12A రైల్వే కాలనీ. ఈ చిత్రానికి ఇదే టైటిల్ని పెట్టారు. పొలిమేర సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా క్షుద్ర పూజలు, ఆత్మలతో కొనసాగేలా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి నిన్నటి రోజున టైటిల్ గ్లింప్స్ సైతాన్ రిలీజ్ చేయగా బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. టీజర్ విషయానికి వస్తే.. ఆత్మలు కొంతమందికే ఎందుకు కనబడతాయి మిగతా వారికి ఎందుకు కనపడవు అనే డైలాగుతో మొదలవుతుంది. టీజర్ చూస్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. హర్రర్ నేపథ్యంలోనే ఉండేలా ఉన్నది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకునేలానే కనిపిస్తున్నది.
చాలామందిని భయపెట్టేలా కూడా కనిపిస్తూ ఉన్నది. గతంలో అల్లరి నరేష్ కామెడీ హారర్ సినిమాలతో వచ్చిన కానీ ఈసారి మాత్రం అల్లరి నరేష్ పెద్ద ప్లాన్ తోనే హిట్టు కొట్టేలా వస్తున్నారని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నదని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. 12A రైల్వే కాలనీ సినిమాతో మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నారు అల్లరి నరేష్.