
కాగా సోషల్ మీడియాలో స్టార్స్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్స్ ని జనాలు బాగా లైక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ విధివిధానాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు . కాగా కొంతమంది స్టార్ హీరోలకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. కానీ అవి తమ లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ రాగానే అలవాట్లు మొత్తం మార్చేసుకున్నారు . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ బడా హీరో . అయితే మెగాస్టార్ చిరంజీవి సైతం యంగ్ ఏజ్ లో సిగరెట్ తాగే అలవాటు ఉండేదట. ఆయన ఇది ఇష్టం లేకుండానే అలవాటు చేసుకున్నారట . ఫ్రెండ్స్ కారణంగానే ఈ అలవాటు చిరంజీవికి వచ్చేసిందట. అయితే సురేఖను పెళ్లి చేసుకున్నాక సిగరెట్ మొత్తంగా మాన్పించేసిందట.
మహేష్ బాబు: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ప్రజెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాకి సంబంధించిన లీక్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు కూడా ఫుల్ స్మోక్ చేసేవారట . నమ్రత ని ప్రేమించే టైంలో కూడా స్మోక్ చేశారట . కానీ పెళ్లి తర్వాత మాత్రం నమ్రత పూర్తిగా మహేష్ బాబు దగ్గర ఆ స్మోకింగ్ అనే అలవాటును మాన్పించేసిందట
.
అల్లు అర్జున్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి . అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వీళ్ళు వన్ అఫ్ ది క్యూట్ రొమాంటిక్ కపుల్ గా ఉంటారు . అల్లు అర్జున్ కి కూడా స్మోకింగ్ డ్రింకింగ్ హాబిట్ ఉండేదట . కానీ స్నేహ రెడ్డి తన లైఫ్ లోకి వచ్చాక పూర్తిగా ఆ అలవాట్లను మాన్పించేసిందట.
గోపీచంద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా బాగా కష్టపడుతున్న వన్ ఆఫ్ ద టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందరికీ తెలిసిందే. కానీ గోపీచంద్ కూడా ఫ్రెండ్స్ కారణంగా కొన్ని రోజులు స్మోకింగ్ అలవాటు చేసుకున్నారట. అయితే గోపీచంద్ కి స్మోకింగ్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు . ఫ్రెండ్స్ బలవంతం చేయడం కారణంగానే ఆయన స్మోకింగ్ అలవాటు చేసుకున్నారట. అయితే గోపీచంద్ ని ఎన్నిసార్లు స్మోక్ చేయొద్దు అని ప్రభాస్ చెప్పిన వినలేదట. కానీ గోపీచంద్ కి పెళ్లి అయిన తర్వాత ఆయన వైఫ్ తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఆ అలవాటు మొత్తం మానిపించేసిందట..!!