ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన సరే మనం ఒక పదం ఎక్కువగా వింటూ వస్తున్నాం. పాన్ ఇండియా .. పాన్ ఇండియా..  ఏ డైరెక్టర్ చూసినా పాన్ ఇండియా. ఏ కమెడియన్ చూసిన పాన్ ఇండియాహీరోయిన్ ని చూసిన పాన్ ఇండియా . ఇక హీరోల గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . పర్టిక్యూలర్ గా నలుగురు హీరోలు సినిమాలను మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించాలి అని కండిషన్స్ పెట్టుకున్నారు . కొందరు హీరోల కాల్ షీట్స్ చూస్తే దాదాపు నాలుగు ఏళ్ళు పాన్ ఇండియా సినిమాలకే అంకితం చేసేసారు .


అంతలా ఈ పాన్ ఇండియా పిచ్చి  పట్టేసింది సినీ ఇండస్ట్రీకి . అయితే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే సినిమాలలో కనిపిస్తే క్రేజ్ కి క్రేజ్.. పాపులారిటీకి పాపులారిటీ..డబ్బులకి డబ్బులు అన్ని వస్తాయి అనేది కొందరి వర్షెన్. కానీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి . రీసెంట్గా రాంచరణ్  గేమ్ చేంజర్ సినిమా ఎలా అట్టర్ ప్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన కోర్టు సినిమా ఎంత సెన్సేషన్ హిట్ టాక్ అందుకుని.. సంచలనాని క్రియేట్ చేసిందో మనం చూసాం .



హీరో హీరోయిన్ అందరూ కూడా చాలా చాలా కొత్త ఆర్టిస్ట్ లే. కానీ వీళ్లు నటించిన తీరు మాత్రం జనాలను బాగా ఆకట్టుకునేసింది. మరీ ముఖ్యంగా డైరెక్షన్ ఎక్కడ ..? ఎలా చూపించాలి ..? ఎంత చూపించాలి? ఏ విధంగా చూపించాలి ఇవి బాగా ఫాలో అయ్యారు డైరెక్టర్.  కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు ఓ రేంజ్ లో ప్లాన్ డ్ గా హీరోస్ ని ట్రోల్ చేస్తున్నారు . ఇదే విధంగా చిన్న హీరోలు మొత్తం హిట్లు కొట్టుకుంటూ పోతే .. ఇక పాన్ ఇండియా స్టేటస్ ఉన్న పనికిరాకుండా పోతుంది అని .. పాన్ ఇండియా స్టేటస్ కాదు జనాలను ఎంటర్టైన్ చేసే సినిమాలను తెరకెక్కించి అలాంటి సినిమాలలో మీరు నటిస్తే బాగుంటుంది అంటూ జనాలు ఓపెన్ గా పాన్ ఇండియా హీరోలకి సజెషన్స్ ఇస్తున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్న పరిస్థితి తయారయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: