టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కథ రచయితలలో ఒకరిగా కెరీర్ నీ కొనసాగిస్తున్న వారిలో ప్రసన్న కుమార్ బెజవాడ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలకు కథలను అందించాడు. ఈయన కథలను అందించిన సినిమాలలో కొన్ని మూవీలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం విశ్వక్ సేన్ "దాస్ కా దమ్కి" అనే సినిమాలో హీరో గా నటించి ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కూడా ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించాడు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ గురించి ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ ... ఆన్ పేపర్ పై నేను రాసిన బెస్ట్ కథలలో దాస్ క దమ్కి మూవీ ఒకటి. ఆ సినిమా కథ మొత్తం పూర్తి అయ్యాక అనేక మంది దర్శకులను అనుకున్నాం. కానీ దర్శకులు ఎవరు సెట్ కాలేదు. అలాంటి సమయం లోనే విశ్వక్ ఆ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆయనే ఆ సినిమాకు దర్శకత్వం వహించాలి అనుకున్నాడు. నేను కథ రాసిన సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు అన్ని విషయాలలో నేను ఇన్వాల్వ్ అవుతు ఉంటాను.


కానీ విశ్వక్ హీరో. ఆయన ఆ సినిమాకు దర్శకత్వం వహించడంతో నేను ఆ సినిమా విషయంలో చాలా దూరంగా ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఏదైనా  సలహా అడిగితే అందుకు స్పందించే వాడిని. ఇక సినిమా బాగానే ఉన్నా నేను రాసుకున్న కథకు అందులో కొన్ని మార్పులు , చేర్పులు జరిగాయి అని ఆయన ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pkb